చిత్రం :శాంతి క్రాంతి (1991)
సంగీతం : హంసలేఖ
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి
గాలిగో గాలిగో ఓహో పిల్లగాలిగో
ఈలగా గోలగా నన్ను గిల్లి మేలుకో
ఓ ప్రియురాలా నా ఊపిరందుకో
పరువముతో పరిచయమే పరిమళమై
వేసవిగాలుల్లో వెన్ను కాచుకో
ముసురుకునే విరహములే ఉసురుసురై
గాలిగో గాలిగో ఓహో పిల్లగాలిగో
ఈలగా గోలగా నన్ను గిల్లి మేలుకో
చిలిపిగా జతలనే కలుపు కౌగిలికి నువ్వే వరం
వలపులో జతులనే పలుకు కీర్తనకు నువ్వే స్వరం
తపనలు గని రెప రెపమనే నీ పైటలో నీ పాటలో
జల్లుగో జల్లుగో స్వాతివాన జల్లుగో
ఒంటికీ వానకీ వంతెనేయి చల్లగో
శ్రావణ సంధ్యల్లో సంధి చేసుకో
సరసమనే సమరములో వర్షములో
ఓ ప్రియురాల నీ వెల్లువిచ్చుకో
ఉరవడులే కలబడిన చలి ఒడిలో
జల్లుగో జల్లుగో స్వాతివాన జల్లుగో
ఒంటికీ వానకీ వంతెనేయి చల్లగో
మనసనే మడుగులో సుడులు రేగినది నా జీవితం
తడుపులో మెరుపులా తరలు ప్రేయసికి నా స్వాగతం
ఉరుముల సడి నడుమున పడే
నీ వేటలో సయ్యాటలో
మంచుగో మంచుగో మంచె తోడు ఉంచుకో
మాఘమో మోహమో మాయచేసి పెంచుకో
ఓ ప్రియురాల నా దుప్పటందుకో
వణుకులలో తొణికిన ఈ తళుకులలో
ఈ చలిమంటలలో చలికాచుకో
సలసలతో కిల కిలలే కలబడగా
మంచుగో మంచుగో మంచె తోడు ఉంచుకో
మాఘమో మోహమో మాయచేసి పెంచుకో
హిమములా మహిమలో శ్రమను వీడినది నా జవ్వనం
సుమములా చెలిమిలో సుఖము కోరినది నా జాతకం
మిల మిల మనే మిణుగురులతో
సాగిందిలే సాయంకాలమూ
మంచుగో మంచుగో మంచె తోడు ఉంచుకో
మాఘమో మోహమో మాయచేసి పంచుకో
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon