చిత్రం : జనతాగ్యారేజ్ (2016)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : సుఖ్వీందర్ సింగ్, విజయప్రకాష్
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకు ఏమవరు
ఐన అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
వెనుకడుగైపోరు మనకెందుకు అనుకోరు
జగమంతా మనదే పరివారం అంటారు
ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు
పరులకు వెలుగిచ్చే ద్యేయంగా పుట్టారు
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకు ఏమవరు
ఐన అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
హో ఆపదలో నిట్టూర్పు
అది చాల్లే వీరికి పిలుపు
దూసుకు పోతారూ దుర్మార్గం నిలిపేలా
ఎక్కడికక్కడ తీర్పు
వీరందిచే ఓదార్పూ
తోడై ఉంటారూ తోబుట్టిన బందం లా
మనసే చట్టంగా
ప్రతి మనిషికి చుట్టంగా
మేమున్నామంటారూ
కన్నీలలొ నవ్వులు పూయిస్తూ
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకు ఏమవరు
ఐన అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
హుమ్. దర్మం గెలవనిచోటా
తప్పదు కత్తులవేట
తప్పూ ఒప్పేదో సంహారం తరువాతా
రణమున భగవత్ గీత
చదివిందీ మన గత చరితా
రక్కసి మూకలతో బ్రతికే హక్కే లేదంట
ఎవరో వస్తారు మనకేదో చేస్తారు
అని వేచే వేదనకూ
జవాబే ఈ జనతా
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకు ఏమవరు
ఐన అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon