చిత్రం : ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దేవులపల్లి కృష్ణ శాస్త్రి
గానం : పి.సుశీల
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు ..
పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు ...
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు..
పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు...
ఎంత తొందరలే హరి పూజకు ...
ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ .....
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు...
పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు..
కొలువైతివా దేవి నాకోసము...
కొలువైతివా దేవి నాకోసము..
తులసీ ..... తులసీ దయాపూర్ణకలశీ...
కొలువైతివా దేవి నాకోసము..తులసీ....
తులసీ దయాపూర్ణకలశీ...
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి .....
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి .....
మొల్లలివి ...నన్నేలు నా స్వామికి...
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు...
పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
ఎంత తొందరలే హరి పూజకు...
ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ ...
ఏ లీల సేవింతు.. ఏమనుతు కీర్తింతు...
ఏ లీల సేవింతు.. ఏమనుతు కీర్తింతు
సీత మనసే నీకు సింహాసనం...
ఒక పువ్వు పాదాల....ఒక దివ్వె నీ మ్రోల....
ఒక పువ్వు పాదాల...ఒక దివ్వె నీ మ్రోల
ఒదిగి నీ ఎదుట ఇదే వందనం .....
ఇదే వందనం .....
ఉం..ఉమ్మ్..ఉమ్మ్..ఉమ్మ్...
ఉమ్మ్....ఉమ్మ్...ఉమ్మ్...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon