ఎంత హాయి ఈ రేయి పాట లిరిక్స్ | గుండమ్మ కథ (1962)

 చిత్రం : గుండమ్మ కథ (1962)

సంగీతం : ఘంటసాల

సాహిత్యం : పింగళి

గానం : ఘంటసాల, సుశీల


ఎంత హాయీ...

ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి

ఆ ఆ ఆ ఆ..

ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి

చందమామ చల్లగ మత్తుమందు చల్లగా

ఆ..చందమామ చల్లగ పన్నీటిజల్లు చల్లగా


ఎంత హాయీ..

ఎంత హాయి ఈ రేయి

ఎంత మధుర మీహాయీ.. ఎంత హా యీ


ఆ ఆ ఆ ఆ..

ఒకరి చూపులొకరిపైన విరితూపులు విసరగా

ఆ ఆ ఆ..

ఒకరి చూపులొకరిపైన విరితావులు వీచగా

విరితావుల పరవడిలో విరహమతిశయింపగా

ఆ..విరితావుల ఘుమఘుమలో మేను పరవశింపగా


ఎంత హాయీ..

ఎంత హాయి ఈ రేయి

ఎంత మధుర మీహాయీ.. ఎంత హా యీ


ఆ ఆ ఆ ఆ.......

కానరాని కోయిలలు మనల మేలుకొలుపగా

కానరాని కోయిలలు మనకు జోల పాడగా

మధురభావ లాహిరిలో మనము తూలిపోవగా

ఆ..మధురభావ లహరిలో మనము తేలిపోవగా


ఎంత హాయీ..

ఎంత హాయి ఈ రేయి

ఎంత మధుర మీహాయీ.. ఎంత హా యీ

ఎంత హాయీ..ఈ రేయి 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)