ఏమనెనే చిన్నారి ఏమనెనే పాట లిరిక్స్ | షావుకారు (1950)

 


చిత్రం : షావుకారు (1950)

సాహిత్యం : సీనియర్ సముద్రాల

సంగీతం : ఘంటసాల  

గానం : ఘంటసాల


ఏమనెనే....

ఏమనెనే చిన్నారి ఏమనెనే

ఏమనెనే....

వన్నెల సిగ పూవ కను సన్నలలో భావమేమి

వన్నెల సిగ పూవ కను సన్నలలో భావమేమి

ఏమనెనే...

ఏమననే... 

ఆమని కోయిల పాటల

గోములు చిలికించు వలపు కిన్నెర

తానేమని రవళించెనే


ఏమనెనే చిన్నారి ఏమనెనే

ఏమనెనే...

 

వనరుగా చనువైన నెనరుగా

పలుకె బంగారమై

కులుకె సింగారమై

మా వాడ రాచిలుక మౌనమౌనముగా


ఏమనెనే చిన్నారి ఏమనెనే

వన్నెల సిగ పూవ కను సన్నలలో భావమేమి

వన్నెల సిగ పూవ కను సన్నలలో భావమేమి

ఏమనెనే...

ఏమనెనే చిన్నారి ఏమనెనే

Share This :



sentiment_satisfied Emoticon