ఏనాడైనా అనుకున్నానా పాట లిరిక్స్ | ఎదురు లేని మనిషి (2001)

 చిత్రం : ఎదురు లేని మనిషి (2001) 

సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్

సాహిత్యం : సిరివెన్నెల

గానం : హరిహరన్, చిత్ర


ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా..

ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా..

మనసుని మరి మరి అడగనా 

నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా 

నీ నీడలో నా ప్రాణం మారాకు వేయగా..


ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా..

ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా..


నిసపా గమరి నిసపా


శిలలైనా చిగురించే చినుకంటి శ్రీమతీ

తొలిసారీ తెలిసిందే చెలిమి సంగతీ 

గగనాలే శిరసొంచే సుగుణాల పెన్నిధీ 

వరమల్లే దొరికావే మంచి పెనిమిటీ 

ఓ ప్రతి అణువు తెగబరువై నిన్ను వేడుకున్నదీ 

జతపడుతూ సగమైతే ఎంత వేడుకన్నదీ 

ఇన్నాళ్ళు ఇంతటి భారం అనిపించలేదుగా 

నన్నేలు బంగరు ద్వారం కనిపించలేదుగా 


ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా..

ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా..


హృదయాంతరంగ శృంగారగంగ ప్రవహించె 

ప్రణయ పరవశంగా 

మృధుశృంగ ధార మధురామృతాలే జతిమధన 

మధుర మిధునమంతా


వెలుగంటే పడదంటూ కసిరే కసిరేయిలో 

తొలిపొద్దై వెలిగావే ప్రేమబంధమా 

వలపంటే విషమంటూ ఉలికిపడే గుండెలో 

అమృతమై కురిశావే ప్రణయమధురిమా 

ఓఓ..మెలకువనే కల అంటూ మూసుకున్న కళ్ళకీ 

ఒంటరిగా పయనిస్తూ దారి తప్పు కాళ్ళకీ 

సూర్యోదయం చూపావే నూరేళ్ళ కుంకుమా 

నా తీరమై నిలిచావే నా ఇంటి దీపమా 


ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా..

ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా..

మనసుని మరి మరి అడగనా 

నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా 

నీ నీడలో నా ప్రాణం మారాకు వేయగా..

Share This :



sentiment_satisfied Emoticon