ఏకువలోనా గోదారి ఎరుపెక్కింది పాట లిరిక్స్ | సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)

 చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)

సంగీతం : మిక్కీ జే మేయర్

సాహిత్యం : అనంత శ్రీరాం

గానం : చిత్ర


ఏకువలోనా గోదారి ఎరుపెక్కింది

ఆ ఎరుపేమో గోరింటా పంటైయ్యింది

ఏకువలోనా గోదారి ఎరుపెక్కింది

ఆ ఎరుపేమో గోరింటా పంటైయ్యింది


పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి

అహ సిగ్గంతా చీర కట్టింది

చీరలో చందమామా ఎవ్వరమ్మా

ఆ గుమ్మ సీతమ్మా


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సిరిమల్లె చెట్టేమో విరగబూసింది

కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు

కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి

కొప్పున పూలు గుప్పే తంతెందుకండి

కోదండరామయ్య వస్తున్నాడండీ


రానే వచ్చాడోయమ్మా ఆ రామయ్య

వస్తూ చేశాడోయమ్మా ఏదో మాయా

రానే వచ్చాడోయమ్మా ఆ రామయ్య

వస్తూ చేశాడోయమ్మా ఏదో మాయా


సీతకీ రాముడే సొంతమయ్యే చోటిది

నేలతో ఆకసం వియ్యమొందే వేళిది

మూడు ముళ్లు వేస్తే

మూడు లోకాలకి ముచ్చటొచ్చేనమ్మా... ఓ...

ఏడు అంగలేస్తే ఏడు జన్మలకీ వీడదీ సీతమ్మా


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది

చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాటా

ఆ మాటా విన్నావా రామా అంటుంది

రామా రామా అన్నది ఆ సీతా గుండె

అన్ననాడే ఆమెకు మొగుడయ్యాడే


చేతిలో చేతులే చేరుకుంటే సంబరం

చూపులో చూపులే లీనమైతే సుందరం


జంట బాగుందంటూ గొంతు విప్పాయంటా

చుట్టూ చెట్టూ చేమా... ఓ...

పంట పండిందంటూ పొంగి పోయిందమ్మా

ఇదిగో ఈ సీతమ్మ... ఓ...


Share This :



sentiment_satisfied Emoticon