ఈ తూరుపూ ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళా పాట లిరిక్స్ | పడమటి సంధ్యారాగం (1986)

 


చిత్రం : పడమటి సంధ్యారాగం (1986)

సంగీతం : బాలు

సాహిత్యం : వేటూరి

గానం : బాలు, జానకి


ఈ తూరుపూ ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళా

పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే...


you avakay me ice cream

this is the hot and sweet loves dream

united streets of hearts we have

like indian namasthe


ఆకశంలో తారా సుడిగాలికారని దీపం

గుడిలేని దైవం కోసం ఒడి చేరుకున్నదిలే


సాగరంలో కెరటం ఉప్పొంగిన నా హృదయం

అలిసేది కాదనురాగం ఈ జన్మ సంగీతం..


గ్రహణాలు లేనీ ఆ తారలన్నీ...గగనాన కలిసీ ఈ వేళలోనే

కలిసింది ఈ బంధం...కలిసింది ఈ బంధం


ఈ తూరుపూ ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళా

పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే


ఛైత్ర కోయిలలెన్నో మైత్రి వేణువులూదే

మనసైన మాటల కోసం మౌనాల ఆశలు పూసే


ఏడేడు రంగుల దీపం ఆ నింగిలో హరితాపం

అరుణాల రుధిరంతోనే ఋణమైనదీ ప్రియబంధం


ఏ దేశమైనా ఆకాశమొకటే...ఏ జంటకైనా అనురాగమొకటే..

అపురూపమీ ప్రణయం.... అపురూపమీ ప్రణయం


ఈ తూరుపూ ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళా

పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే


you avakay me ice cream

this is the hot and sweet loves dream

united streets of hearts we have

like indian namasthe


Share This :



sentiment_satisfied Emoticon