ఈ ఎర్రగులాబీ విరిసినది పాట లిరిక్స్ | ఎర్ర గులాబీలు (1979)

 చిత్రం : ఎర్ర గులాబీలు (1979)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : వేటూరి

గానం : బాలు, జానకి 


రురూరురూ.. రురురురూ..

రురురురురురు.. 

ఎర్రగులాబీ విరిసినది

తొలిసారి నను కోరి

ఆశే రేపింది నాలో..

అందం తొణికింది నీలో..

స్వర్గం వెలిసింది భువిలో..


ఈ ఎర్రగులాబీ విరిసినది

తొలిసారి నిను కోరి

ఆశే రేపింది నీలో..

అందం తొణికింది నాలో..

స్వర్గం వెలిసింది భువిలో..

ఈ ఎర్రగులాబీ విరిసినదీ..

 

లతనై నీ జతనై నిన్నే పెనవేయనా

కతనై నీ కలనై నిన్నే మురిపించనా

నేనిక నీకే సొంతము 

న న న న న

నీకెందుకు ఈ అనుబంధము

న న న న న న న న న న న నా

 

ఈ ఎర్రగులాబీ విరిసినది

తొలిసారి నను కోరి

ఆశే రేపింది నీలో..

అందం తొణికింది నాలో..

స్వర్గం వెలిసింది భువిలో.. 


 

ఈ ఎర్రగులాబీ విరిసినది ..


పెదవిని.. ఈ మధువునూ నేడే చవిచూడనా

నాదని ఇక లేదనీ నీకే అందివ్వనా

వయసుని వయసే దోచేది

న న న న న న

అది మనసుని నేడే జరిగేది

న న న న న న న న న న న నా


ఈ ఎర్రగులాబీ విరిసినది

తొలిసారి నిను కోరి 

ఆశే రేపింది నాలో..

అందం తొణికింది నీలో..

స్వర్గం వెలిసింది భువిలో..

ఈ ఎర్రగులాబీ విరిసినది..

నననన.. నననన..అహహా...

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)