చిత్రం : పెళ్ళిపుస్తకం (1991)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : సుశీల
ఆయియి యి శ్రీ రంగశాయి
ఆయి ఆయి శ్రీ రంగశాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
ఆయియి యి శ్రీ రంగశాయి
ఆయి ఆయి శ్రీ రంగశాయి
ఏదీకాని వేళా ఎడద ఉయ్యాల
ఏదీకాని వేళా ఎడద ఉయ్యాల..
కోరి జో కొట్టింది కుసుమ సిరిబాల
ఆయియి యి శ్రీ రంగశాయి
ఆయి ఆయి శ్రీ రంగశాయి
అజ్ఞాత వాసాన అతివ పాంచాలి
ఆరళ్లు భీమన్న దూరమ్ముసేయు
ఆవేశ పడరాదు అలసిపోరాదు
అభిమానమే చాలు అణుచుకొన మేలు
ఆయి ఆయి శ్రీ రంగశాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
ఆయి ఆయి శ్రీ రంగశాయి
నిద్ర కన్యకలొచ్చి నిలచి దీవిస్తే
భద్ర కన్యకలేమో పలుకు తథాస్తు
నిద్ర కన్యకలొచ్చి నిలచి దీవిస్తే
భద్ర కన్యకలేమో పలుకు తథాస్తు
మాగన్నులోనైన మరచిపో కక్ష
సిరి కనుల నిద్దురకు శ్రీరామరక్షా..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon