దానం ధర్మమే వేదాల నీతి సారము పాట లిరిక్స్ | సతీ సుమతి (1967)

 చిత్రం : సతీ సుమతి (1967)

సంగీతం : పి.ఆదినారాయణరావు

సాహిత్యం : సముద్రాల

గానం : సుశీల


ఆఆఅ...ఆఆ..ఆఆఅ..ఆఆ...

దానం.. ధర్మమే.. వేదాల నీతి సారము

మీ దానం మీ ధర్మం నిరుపేదల జీవాధారం

దానం.. ధర్మమే.. వేదాల నీతి సారము

మీ దానం మీ ధర్మం నిరుపేదల జీవాధారం


మహారాజులైనా మహివీడు వేళ

కొనిపోయినారా తమవెంట సిరులా

మహారాజులైనా మహివీడు వేళ

కొనిపోయినారా తమవెంట సిరులా

నెర దాత పేరే నిలిచేది ధరణీ..


దానం.. ధర్మమే.. వేదాల నీతి సారము

మీ దానం మీ ధర్మం నిరుపేదల జీవాధారం

దానం.. ధర్మమే.. వేదాల నీతి సారము

మీ దానం మీధర్మం నిరుపేదల జీవాధారం 

Share This :



sentiment_satisfied Emoticon