చిత్రం : భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్. సుదర్శనం ఆర్. గోవర్ధనం
సాహిత్యం : సముద్రాల సీనియర్
గానం : ఎం.ఎల్.వసంతకుమారి
దేవ మహాదేవ మము బ్రోవుము శివా
దేవ మహాదేవ మము బ్రోవుము శివా
దేవా మహాదేవ మము బ్రోవుము శివా
భవ పాశ నాశనా భువనైక పోషణ
దేవ మహాదేవ మము బ్రోవుము శివా
భవ పాశ నాశనా భువనైక పోషణ
పరమ ప్రేమాకార నిఖిల జీవాధార
పరమ ప్రేమాకార నిఖిల జీవాధార
సకల పాప విదూర దరహాస గంభీర
దేవ మహాదేవ మము బ్రోవుము శివా
దివ్య తేజోపూర్ణ తనయులను కన్నాను
దివ్య తేజోపూర్ణ తనయులను కన్నాను
దేవతా మాతలతో పరియశము గొన్నాను
దివ్య తేజోపూర్ణ తనయులను గన్నాను
కావుమా నా సుతుల చల్లగా గౌరీశ
కావుమా నా సుతుల చల్లగా గౌరీశ
ఈ వరము నాకొసగు ప్రేమతో సర్వేశ
దేవ మహాదేవ మము బ్రోవుము శివా
భవ పాశ నాశనా భువనైక పోషణ
దేవ మహాదేవ మము బ్రోవుము శివా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon