చిత్రం : చదువు సంస్కారం (1974)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : సినారె
గానం : సుశీల
ఉమ్.. ఊఁ.. ఆ.. ఆ..
దీపానికి కిరణం ఆభరణం..
రూపానికి హృదయం ఆభరణం
హృదయానికి.. ఏనాటికీ..
తరగని సుగుణం.. ఆభరణం
తరగని సుగుణం.. ఆభరణం
దీపానికి కిరణం ఆభరణం..
రూపానికి హృదయం ఆభరణం
నిండుగ పారే యేరు..
తన నీటిని తానే తాగదు
జగతిని చూపే కన్ను..
తన ఉనికిని తానే చూడదు
పరుల కోసం.. బ్రతికే మనిషి..
పరుల కోసం బ్రతికే మనిషి..
తన బాగు తానే కోరడు..
తన బాగు తానే కోరడు..
దీపానికి కిరణం ఆభరణం..
రూపానికి హృదయం ఆభరణం
తాజమహలులో కురిసే వెన్నెల..
పూరి గుడిసెపై కురియదా
బృందావనిలో విరిసే మల్లియ..
పేద ముంగిట విరియదా
మంచితనము పంచేవారికి..
మంచితనము పంచేవారికి..
అంతరాలతో పని ఉందా..
అంతరాలతో పని ఉందా..
దీపానికి కిరణం ఆభరణం..
రూపానికి హృదయం ఆభరణం
వెలుగున ఉన్నంత వరకే..
నీ నీడ తోడుగా ఉంటుంది
చీకటిలో నీవు సాగితే..
అది నీకు దూరమవుతుంది
ఈ పరమార్థం తెలిసిన నాడే..
ఈ పరమార్థం తెలిసిన నాడే..
బ్రతుకు సార్థకమౌతుంది..
బ్రతుకు సార్థకమౌతుంది..
దీపానికి కిరణం ఆభరణం..
రూపానికి హృదయం ఆభరణం
హృదయానికి.. ఏనాటికీ..
తరగని సుగుణం.. ఆభరణం
తరగని సుగుణం.. ఆభరణం
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon