దత్తాత్రేయ త్రిమూర్తిరూప పాట లిరిక్స్ | భైరవి రాగం

 రాగం : భైరవి

తాళం : ఆది


పల్లవి:

దత్తాత్రేయ త్రిమూర్తిరూప

త్రిభువన లోక రక్షక

చరణం:

కామధేను కల్పవృక్ష

కామిత ఫలద దాయక .....1


దండకమండలు శూలడమరుక

శంఖచక్ర శోభిత .....2


ఉత్తమ ఉత్తమ పురుషోత్తమ

పూర్ణచంద్ర ప్రకటిత ....3


భావబంధన భవభయ దూర

భక్త కరుణాసాగర ....4


కృత్తికాతారా సిద్ధానుసార

సిద్ధదూత మనోహర ...5


సహ్యాద్రివాస సచ్చిదానంద

శ్రీ గురుదత్త స్వరూప ....6

Share This :



sentiment_satisfied Emoticon