చిత్రం : చిట్టెమ్మ మొగుడు (1993)
రచన : రసరాజు
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : జేసుదాస్, చిత్ర
చినుకు రాలితే... చిగురు నవ్వదా
చిలక వాలితే... చెట్టు పాడదా
చినుకు రాలితే... చిగురు నవ్వదా
చిలక వాలితే... చెట్టు పాడదా
ఎవరి మనసు ఎవరికోసం ఎదురు చూచునో
ఏ ఉదయం ఏ గుండెకు వెలుగు చూపునో
చినుకు రాలితే... చిగురు నవ్వదా
చిలక వాలితే... చెట్టు పాడదా
నీలిమబ్బు నీడను చూచి నెమలి నాట్యమాడదా
పూలకన్నె వన్నెను చూచి తేనెటీగ పాడదా
నీలిమబ్బు నీడను చూచి నెమలి నాట్యమాడదా
పూలకన్నె వన్నెను చూచి తేనెటీగ పాడదా
నింగిలోని జాబిలి మామ నీటిలోని కలువ భామ
ఎంత దూర తీరమునున్నా ఎందుకంత మనసులు దగ్గర
అదే అదే అనురాగం దాని పేరు అనుబంధం
ఎవరి మనసు ఎవరికోసం ఎదురు చూచునో
ఏ ఉదయం ఏ గుండెకు వెలుగు చూపునో
చినుకు రాలితే... చిగురు నవ్వదా
చిలక వాలితే... చెట్టు పాడదా
కోకిలమ్మ రాగం వింటే కొమ్మకెంత సింగారం
జలపాతం దూకుతు ఉంటే కొండకెంత ఒయ్యారం
కోకిలమ్మ రాగం వింటే కొమ్మకెంత సింగారం
జలపాతం దూకుతు ఉంటే కొండకెంత ఒయ్యారం
వానజల్లు కిందికిరాగ నేల ఒళ్లు ఒంపులు సాగ
ఎందుకంత తీయని ప్రేమా ఎవరికైన తెలిసేనా
అదే అదే అనురాగం దాని పేరు అనుబంధం
ఎవరి మనసు ఎవరికోసం ఎదురు చూచునో
ఏ ఉదయం ఏ గుండెకు వెలుగు చూపునో
చినుకు రాలితే... చిగురు నవ్వదా
చిలక వాలితే... చెట్టు పాడదా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon