చిగురాకుల ఊయలలో పాట లిరిక్స్ | కానిస్టేబుల్ కూతురు (1962)

 చిత్రం : కానిస్టేబుల్ కూతురు (1962)

సంగీతం : ఆర్. గోవర్ధన్

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ

గానం : సుశీల, పి. బి. శ్రీనివాస్


చిగురాకుల ఊయలలో 

ఇల మరచిన ఓ చిలుకా

మధురాశలు పలికేవో 

నా మనసును చిలికేవో..ఓ..ఓ

చిగురాకుల ఊయలలో 

ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ


నీ అడుగుల జాడలలో

నా నీడను కలిపేనా  

నీ అడుగుల జాడలలో

నా నీడను కలిపేనా

నీ చూపుల కాంతులలో.. 

నా రూపును నిలిపేనా..ఆ..ఆ..అ


చిగురాకుల ఊయలలో 

ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ


నా దారిలో నిను జూచి 

నును సిగ్గుతో తొలగేనా ఆ ఆ ఆ 

 నా దారిలో నిను జూచి 

నును సిగ్గుతో తొలగేనా ఆ ఆ ఆ

కలలో నిను కనినంతా 

నిజమే అని పిలిచేనా..ఆ..ఆ..ఆ


చిగురాకుల ఊయలలో 

ఇల మరచిన ఓ చిలుకా

మధురాశలు పలికేవో 

మా చెల్లిని పిలిచేవో..ఓ..ఓ..

చిగురాకుల ఊయలలో 

ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ

 

విరిపూలతో ఆడును లే 

చిరుగాలితో పాడును లే

విరిపూలతో ఆడును లే 

చిరుగాలితో పాడును లే

మా చెల్లెలు బాల సుమా 

ఏమెరుగని బేల సుమా..ఆ..ఆ..ఆ


చిగురాకుల ఊయలలో 

ఇల మరచిన ఓ చిలుకా

మధురాశలు పలికేవో 

మా చెల్లిని పిలిచేవో..ఓ..ఓ..

చిగురాకుల ఊయలలో 

ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)