చిగురేసే మొగ్గేసే సొగసంత పుతపూసే పాట లిరిక్స్ | ఆలుమగలు (1977 )

 చిత్రం : ఆలుమగలు (1977 )

సంగీతం : టి.చలపతిరావు

సాహిత్యం : వేటూరి

గానం : బాలు, సుశీల


చిగురేసే మొగ్గేసే  సొగసంత పుతపూసే..

చెయ్యైన వెయ్యవేమి ఓ బాబూదొర

చెయ్యైన వెయ్యవేమి ఓ బాబూదొర

ఉయ్యాలలూపవేమీ ఈ..ఈ..ఈ..


చిగురేసే మొగ్గేసే సొగసంత పుతపూసే

ఇవ్వాలని లేదా ఏమి

ఆ సొగసంతా ఇవ్వాలని లేదా ఏమి 

ఓ సిరిపాప.. ఎన్నాళ్ళు దాస్తావేమీ.. ఈ.. ఈ..


ముట్టుకుంటే ఉలికిపడతావ్ ..

పట్టుకుంటే జారిపోతావ్

ముట్టుకుంటే.. ఉలికిపడతావ్..

పట్టుకుంటే జారిపోతావ్..

నీ చూపుల్లో వుంది సూదంటూ రాయి 

పాపా సిరిపాపా

నీ చూపుల్లో వుంది సూదంటూ రాయి

అది లాగుతుంటే ఒళ్ళంతా హాయి...


చిగురేసేమొగ్గేసే సొగసంత పుతపూసే

చెయ్యైన వెయ్యవేమి ఓ బాబూదొర

చెయ్యైన వెయ్యవేమి ఓ బాబూదొర

ఉయ్యాలలూపవేమీ ఈ..ఈ..ఈ..


చేరుకుంటే ఊరుకుంటావ్..

వల్లకుంటే గిల్లుతుంటావ్...

చేరుకుంటే.. ఊరుకుంటావ్..

వల్లకుంటే.. గిల్లుతుంటావ్..

నీ చేతుల్లో వుందీ చెకుముకిరాయీ..

బాబూ ఓ బాబు

నీ చేతుల్లో వుందీ చెకుముకిరాయీ..

అది రాసుకుంటే చురుకైన హాయి..


చిగురేసే మొగ్గేసే సొగసంత పుతపూసే

ఇవ్వాలని లేదా ఏమి

ఆ సొగసంతా ఇవ్వాలని లేదా ఏమి ఓ సిరిపాప..

ఎన్నాళ్ళు దాస్తావేమీ.. ఈ.. ఈ..


నిన్ను కట్టుకోవాలని మనసౌతాది..

చేయి పట్టుకోవాలంటే గుబులౌతాది..

నిన్ను కట్టుకోవాలని మనసౌతాది..

చేయి పట్టుకోవాలంటే గుబులౌతాది..


గుబులెందుకుకింకా గారాల చిలకా..

ఎగిరెగిరి పోదాము నెలవంక దాక...


చిగురేసేమొగ్గేసే సొగసంత పుతపూసే

చెయ్యైన వెయ్యవేమి ఓ బాబూదొర

చెయ్యైన వెయ్యవేమి ఓ బాబూదొర

ఉయ్యాలలూపవేమీ ఈ..ఈ..ఈ..

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)