చిత్రం : పల్లెటూరు (1952)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : వేములపల్లి శ్రీకృష్ణ
గానం : ఘంటసాల
చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
వీర రక్తపుధార వారఓసిన సీమ
వీర రక్తపుధార వారఓసిన సీమ
పలనాడు నీదెరా వెలనాడు నీదెరా
పలనాడు నీదెరా వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవడోయి!
తాండ్ర పాపయ్య గూడ నీవోడోయ్!
నాయకీ నాగమ్మ, మల్లమాంబా, మొల్ల
నాయకీ నాగమ్మ, మల్లమాంబా, మొల్ల
మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే
మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే
వీరవనితలగన్న తల్లేరా!
ధీరమాతల జన్మభూమేరా!
కల్లోల గౌతమీ వెల్లువల కృష్ణమ్మ
కల్లోల గౌతమీ వెల్లువల కృష్ణమ్మ
తుంగభద్రా తల్లి పోంగిపొరలిన చాలు
తుంగభద్రా తల్లి పోంగిపొరలిన చాలు
ధాన్యరాసులే పండు దేశానా!
కూడు గుడ్డకు కొదువలేదోయీ!
ముక్కోటి బలగమోయ్ ఒక్కటై మనముంటే
ఇరుగు పొరుగులోన వూరు పేరుంటాది
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!
సవతి బిడ్డల పోరు మనకేలా!
పెనుగాలి వీచింది అణగారి పోయింది
పెనుగాలి వీచింది అణగారి పోయింది
నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది
నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది
చుక్కాని బట్టారా తెలుగోడా!
నావ దరిజేర్చరా మొనగాడా!
చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon