చక్కనైన ఓ చిరుగాలి పాట లిరిక్స్ | ప్రేమసాగరం (1983)

 


చిత్రం : ప్రేమసాగరం (1983)

సంగీతం : టి. రాజేందర్

సాహిత్యం : రాజశ్రీ

గానం : బాలు


చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి

చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి


ఉషా దూరమైన నేను... ఊపిరైన తీయలేను

గాలి.. చిరుగాలి .. చెలి చెంతకు వెళ్ళి అందించాలి

నా ప్రేమ సందేశం...


చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి

చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి


ఉషా దూరమైన నేను... ఊపిరైన తీయలేను

గాలి.. చిరుగాలి .. చెలి చెంతకు వెళ్ళి అందించాలి

నా ప్రేమ సందేశం...


మూసారు గుడిలోని తలుపులను

ఆపారు గుండెల్లో పూజలను

దారిలేదు చూడాలంటే దేవతను

వీలుకాదు చెప్పాలంటే వేదనను

కలతైపోయే నా హృదయం 

కరువైపోయే ఆనందం

అనురాగమీవేళ అయిపోయే చెరసాల

అనురాగమీవేళ అయిపోయే చెరసాల

అయిపోయె చెరసాల


గాలి..  చిరుగాలి..  చెలి చెంతకు వెళ్ళి

అందించాలి... నా ప్రేమ సందేశం..

నా ప్రేమ రాగాలు కలలాయె

కన్నీటి కథలన్ని బరువాయే

మబ్బు వెనక చందమామ దాగి ఉన్నదో

మనసు వెనుక ఆశలన్ని దాచుకున్నదో

వేదనలేల ఈ సమయం

వెలుతురు నీదే రేపుదయం

శోధనలు ఆగేను శోకములు తీరేను

శోధనలు ఆగేను శోకములు తీరేను

శోకములు తీరేను..


గాలి..  చిరుగాలి..  చెలి చెంతకు వెళ్ళి

అందించాలి... నా ప్రేమ సందేశం...


చక్కనైన ఓ చిరుగాలి.. ఒక్కమాట వినిపోవాలి

చక్కనైన ఓ చిరుగాలి.. ఒక్కమాట వినిపోవాలి


ఉషా దూరమైన నేను.. ఊపిరైన తీయలేను

గాలి.. చిరుగాలి .. చెలి చెంతకు వెళ్ళి అందించాలి

నా ప్రేమ సందేశం.. ఈ నా ప్రేమ సందేశం..

ఈ  నా ప్రేమ సందేశం

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)