Album: Vasantam
చిత్రం : వసంతం (2003)
సంగీతం : ఎస్.ఎ.రాజ్‌కుమార్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కె.ఎస్.చిత్ర
గాలీ చిరుగాలీ నిను చూసినదెవరమ్మా
వెళ్లే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
రూపమే ఉండనీ ఊపిరే నువ్వనీ
ఎన్నడూ ఆగని పయనమే నీదని
కనురెప్ప మూసి ఉన్న నిదరొప్పుకోను అన్న
నిను నిలువరించినా ఓ స్వప్నమా
అమావాసలెన్నైనా గ్రహణాలు ఏవైనా
నీ కలను దోచిన ఓ చంద్రమా
తన ఒడిలో ఉన్నది రాయో రత్నమొ
పోల్చదు నేలమ్మా
ఉలి గాయం చేయకపోతే
ఈ శిల శిల్పం కాదమ్మా
మేలుకో మిత్రమా
గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా
చీకటే దారిగా వేకువే చేరదా...
గాలీ చిరుగాలీ నిను చూసినదెవరమ్మా
వెళ్లే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
చలి కంచె కాపున్నా పొగమంచు పొమ్మన్నా
నీ రాక ఆపినా వాసంతమా
ఏ కొండ రాళ్లైనా ఏ కోన ముళ్లైనా
బెదిరేనా నీ వాన ఆషాడమా
మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలుసుమా
కలకాలం నిన్ను అణచదు మన్ను
ఎదిగే విత్తనమా సాగిపో నేస్తమా
నిత్యము తోడుగా నమ్మకం ఉందిగా
ఓరిమే సాక్షిగా ఓటమే ఓడగా...
గాలీ చిరుగాలీ నిను చూసినదెవరమ్మా
వెళ్లే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
రూపమే ఉండనీ ఊపిరే నువ్వనీ
ఎన్నడూ ఆగని పయనమే నీదని
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon