చిత్రం : పెదరాయుడు (1995)
సంగీతం : కోటి
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, చిత్ర
తనానననే.. నా
తనానననే.. నా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
హే.. బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
కొత్త కోక కిర్రెక్కిపోని.. సన్న రైక వెర్రెక్కిపోనీ
కొత్త కోక కిర్రెక్కిపోని.. సన్న రైక వెర్రెక్కిపోని
కన్నె సొగసే గుమ్మెత్తిపోనీ
బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
ఒంటరి ఒంటరి వయసు
తుంటరి తుంటరి మనసు
జంటను వెతికే వేళ ఇదీ
తొందర తొందర పడకోయి
అల్లరి అల్లరి మొగుడా
రెక్కలు విప్పిన రాతిరిది
ఓయ్ పైన చూస్తే తళుకుల తార..
కింద చూస్తే వెన్నెల ధార
పక్కనుందోయ్ ముద్దుల డేరా..
చక్కగొచ్చి హత్తుకుపోరా.. అహ..
పడుచు ఒడినే పంచుకుపోరా.. హోయ్
భామవి నువ్వు బావను నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
హే..
టక్కర చూపులు కొడితే
సిగ్గుల వాకిట తడితే
ఉక్కిరి బిక్కిరి అయిపోనా
తత్తర తత్తర పడితే
టక్కున కౌగిలి విడితే
టక్కరి పిల్లా రెచ్చిపోనా
హా.. గువ్వ గుట్టు గోరింకకెరుక..
పిల్ల బెట్టు పిల్లాడికెరుక
హా.. ఒప్పుకుంటే వయ్యారి కూన..
కురిసిపోదా ముత్యాలవాన
జంట తాళం చూడవే జాణ
బావవి నువ్వు.. హొయ్..
భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
కొత్త కోక కిర్రెక్కిపోని.. ఆ.. సన్న రైక వెర్రెత్తిపోనీ
కొత్త కోక కిర్రెక్కిపోని.. సన్న రైక వెర్రెక్కిపోని
కన్నె సొగసే గుమ్మెత్తిపోనీ
బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
నిద్దర కరువవనీ… హె.. ఇద్దరమొకటవనీ…
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon