చిత్రం : ఖుషి (2001)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : చంద్రబోస్
గానం : ఉదిత్ నారాయణ్, కవితా సుబ్రహ్మణ్యం
అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే
అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే
ఆ నవ్వులు ఈ చూపులు
ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే
అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే
ప్రేమలు పుట్టె వేళ పగలంత రేయేలే
ప్రేమలు పండె వేళ జగమంత జాతరలే
ప్రేమే తోడుంటె పామైన తాడేలే
ప్రేమే వెంటుంటె రాయైన పరుపేలే
నీ ఒంట్లో ముచ్చెమటైన నా పాలిట పన్నీరే
నువ్విచ్చె పచ్చి మిరపైన నా నోటికి నారింజె
ఈ వయసులో ఈ వరసలో
ఈ వయసులో ఈ వరసలో నిప్పైనా నీరేలే
అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే
నేనొక పుస్తకమైతే నీ రూపె ముఖ చిత్రం
నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్ధం
యెగిరె నీ పైటె కలిగించె సంచలనం
ఒలికే నీ వలపె చెయ్యించె తలస్నానం
యెండల్లొ నీరెండల్లో నీ చెలిమె చలివేంద్రం
మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపె రవి కిరణం
పులకింతలె మొలకెత్తగ
పులకింతలే మొలకెత్తగ ఇది వలపుల వ్యవసాయం
అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే
ఆ నవ్వులు ఈ చూపులు
ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon