అదిగదిగొ మొదలైంది వారధి పాట లిరిక్స్ | బాలరామాయణం (1997)

 చిత్రం : బాలరామాయణం (1997)

సంగీతం : మాధవపెద్ది సురేష్

సాహిత్యం : మల్లెమాల

గానం : బాలు


అదిగదిగొ మొదలైంది వారధి..

రామాయణానికది సారధి

అదిగదిగొ మొదలైంది వారధి..

రామాయణానికది సారధి


శ్రీరామ నామం పునాదిగా

సీతమ్మ కడగళ్ళు రాళ్ళుగా

లోకకళ్యాణమై రూపొందుచున్నట్టి

వారధే మనపాలి పెన్నిధీ


అదిగదిగొ మొదలైంది వారధి..

రామాయణానికది సారధి


అధినేత సుగ్రీవు ఆజ్ఞపాటించీ

హనుమ అంగదులాది వేలాది వానరులు

పగలేంది రేయేంది

పగలేంది రేయేంది పని మనకు

ముఖ్యమని పాటు పడుచుండగా


అదిగదిగొ సగమైంది వారధి..

రామాయణానికది సారధి


ఇంతలో ఒక ఉడుత ఇటు అటును పొర్లాడి

రాళ్ళ మధ్యను ఇసుక రాల్చుటను గమనించి

చందగల గిరులు విరిబంతులై పైకెగసి

కపులు నివ్వెరపోవ కడలిపై వాలాయి


అదిగదిగొ పూర్తైంది వారధి..

రామాయణానికది సారధి

రామాయణానికది సారధి


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)