చిత్రం : జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం : శ్రీ కళ్యాణ రమణ
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : కార్తీక్, రమ్య బెహరా
ఆకుపచ్చని చందమామలా మారిపోయె భూలోకం
ఈ రోజే గమ్మత్తుగా
గోరువెచ్చనీ సూర్యకాంతిలా తాకుతోంది ఆనందం
దాచేయ్యాలన్నంతగా
కేరింతల్లో ఇలా... సీతాకోకలా.. ఎగిరిందిలే మనస్సంతా
సంతోషం ఏదంటూ అందర్నీ అడగాలా
మనచుట్టే వుంటుందిగా చూస్తే ఇలా
ఆహాహా బాగున్నదీ
ఈ హాయి బాగున్నదీ
ఆకుపచ్చని చందమామలా మారిపోయె భూలోకం
ఈ రోజే గమ్మత్తుగా
గోరువెచ్చనీ సూర్యకాంతిలా తాకుతోంది ఆనందం
దాచేయ్యాలన్నంతగా
తరించే క్షణాలే ఏరి క్షణంలో నిధుల్లా మార్చుకుందాం
తమాషా కబుర్లే తెచ్చి మనస్సు అరల్లో పేర్చుకుందాం
వసారాలు దాటొచ్చాయీ వసంతాలు ఈ వేళా
తుషారాలు చిరునవ్వుల్లో కురిసేలా
ప్రతీ దారి ఓ మిణుగుర్లా మెరుస్తోంది ఈ వేళా
కలుస్తున్నవే నింగినేలా
ఆహాహా బాగున్నదీ
ఆహాహా బాగున్నదీ
ఈ హాయి బాగున్నదీ
ఈ హాయి బాగున్నదీ
ఆహాహా బాగున్నదీ
బాగున్నదీ బాగున్నదీ
భుజంతో భుజాన్నే తట్టి బలంగా భరోసా ఇచ్చుకుందాం
ఒకర్లో ఒకర్లా మారి నిదర్లో కలల్నే పంచుకుందాం
మహా మత్తులో ఈరోజే పడేస్తోంది ఈ గాలీ
సుగంధాలు ఏం జల్లిందో అడగాలీ
మరో పుట్టుకా అన్నట్టూ మరీ కొత్తగా వుందీ
ఇందేం చిత్రమో ఏమో గానీ ఆహాహా బాగున్నదీ
ఆహాహా బాగున్నదీ
ఈ హాయి బాగున్నదీ
ఈ హాయి బాగున్నదీ
ఆహాహా బాగున్నదీ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon