చిత్రం : గోవుల గోపన్న (1968)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : దాశరధి
గానం : ఘంటసాల, సుశీల
ఆకాశంలో హంసలమై
హాయిగ ఎగిరే జంటలమై
అలా అలా కులాసాల తేలిపోదామా
ఆకాశంలో హంసలమై
హాయిగ ఎగిరే జంటలమై
అలా అలా కులాసాల తేలిపోదామా
వెండి మబ్బుల విమానాలపై
విహారాలనే చేద్దామా
వెండి మబ్బుల విమానాలపై
విహారాలనే చేద్దామా
మంచుకొండల అంచుల మీద
వాలిపోదామా సోలిపోదామా
ఆకాశంలో హంసలమై
హాయిగ ఎగిరే జంటలమై
అలా అలా కులాసాల తేలిపోదామా
ఆకాశానికి ఆనందానికి
అంతే లేదని అంటారు
ఆకాశానికి ఆనందానికి
అంతే లేదని అంటారు
ఆది దంపతులవలె ఆనందం
అవధులు చూదామా
అవధులు చూదామా
ఆహా ఆహా ఆహాహా
ఆహా ఆహా ఆహాహా
మిన్నేటి కెరటాల మీద
ఉయ్యాలలూగేము నేడే
బంగారు కమలాల నీడ
సయ్యాటలాడేము నేడే
ఆకాశంలో హంసలమై
హాయిగ ఎగిరే జంటలమై
అలా అలా కులాసాల తేలిపోదామా
తేలిపోదామా తేలిపోదామా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon