చిత్రం : వయ్యారిభామలు వగలమారి భర్తలు (1982)
సంగీతం : రాజన్ నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
మేఘాల పందిరి లోనా
మెరిసింది మెరుపే ఔనా
మేఘాల పందిరి లోనా
మెరిసింది మెరుపే ఔనా
అది చూపై విరి తూపై
కురిసింది పూల వాన ఓ..
కురిసింది పూల వాన
రాగాల పల్లకి లోనా
పిలిచింది వలపే ఔనా
అది పాటై విరి బాటై
వెలసింది జీవితానా
ఓఓ వెలసింది జీవితానా
మేఘాల పందిరి లోనా
మెరిసింది మెరుపే ఔనా
గగనాల తార భువనాల జారి
నన్ను చేరువేళలో
నీవే ఆ తారై మదిని వెలిగినావులే
ఇలవంక జారు నెలవంక తీరు గోటమీటు వేళలో
నీవే నా నీడై మనసు తెలిపినావులే
మరులు గొలిపినావులే
అనని వినని ఏ రాగం
మనలో పలికే సరాగం
మేఘాల పందిరి లోనా
మెరిసింది మెరుపే ఔనా
అది చూపై విరి తూపై
కురిసింది పూల వాన ఓ..
కురిసింది పూల వాన
రాగాల పల్లకి లోనా
పిలిచింది వలపే ఔనా
నీ తీపి ఉసురు నా వైపు విసిరి వెల్లువైన వేళలో
నాలో అల నీవై కలలు రేపినావులే
నీ నీలి కనుల లేలేత కలలు వెల్లడైన వేళలో
నాలో ఎద నీవై నిదుర లేచినావులే
కదలి పాడినావులే
మనసే కలిసే ఏ తీరం
విరిసే మమతా కుటీరం
రాగాల పల్లకి లోనా
పిలిచింది వలపే ఔనా
అది పాటై విరి బాటై
వెలసింది జీవితానా
ఓఓ వెలసింది జీవితానా
మేఘాల పందిరి లోనా
మెరిసింది మెరుపే ఔనా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon