చిత్రం : మేడమీద అబ్బాయ్ (2017)
సంగీతం : షాన్ రహ్మాన్
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : వైకొం విజయలక్ష్మి
ఆహా.. నోట్లోన వేలు పెడితె అస్సల్ కొరకనట్టు
గూట్లోన బెల్లంముక్క మింగేసి ఎరగనట్టు
ఫేసుని చూస్తే రాముడు
పనులే చూస్తే కృష్ణుడూ
ఊరికొక్కడుంటే చాలు ఈడిలాంటోడు
ఒళ్ళంత ఎటకారం బాబోయ్ ఎవడండీ వీడు
కంట్లోన కారం కొట్టి కర్చీఫు అందిస్తాడు
చేసేదేంటో చెప్పడు చూసేదేంటో చెప్పడు
డాక్టర్ గారి చీటీలాగ అర్ధమవ్వడు
బిల్డప్పు చూస్తే హైరేంజి..
వీడు తాబేలు కన్నా యమలేజీ
వీడి వేషాలు అన్నీ వ్యాసాలు రాస్తే
అయ్యో సరిపోదొక్క పేజీ..
లైఫంటే వీడికి యమ ఈజీ
వీడికేం నేర్పగలదు కాలేజీ
అరె పాసైతే ఏంటీ ఫెయిలైతే ఏంటీ
ఏమీ పట్టించుకోడు క్రేజీ
నోట్లోన..
నోట్లోన వేలు పెడితె అస్సల్ కొరకనట్టు
గూట్లోన బెల్లంముక్క మింగేసి ఎరగనట్టు
ఫేసుని చూస్తే రాముడు
పనులే చూస్తే కృష్ణుడూ
ఊరికొక్కడుంటే చాలు ఈడిలాంటోడు
చీమంత కష్టం కూడా పడలేని బద్దకిష్టు
ఎట్టాగ ఎక్కగలడు ఎత్తైన ఎవరెస్టు
ఆలూలేదు చూలు లేదు
కొడుకు పేరు సోమలింగం
అన్నట్టుంది అయ్యబాబోయ్ వీడి వాలకం
ఆహా... ఆహాఅ..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon