చిత్రం : పైసా వసూల్ (2017)
సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్
గానం : అనూప్ రూబెన్స్, జితిన్ రాజ్, శ్రీ కావ్య చందన
కన్ను కన్నూ కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
ఓ.. కన్ను కన్నూ కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం
ఇప్పుడయ్యాం కదా ఒక్కరం
మనసు మనసు కలిశాయి
మబ్బుల్లో ఎగిరాయి
గుర్తుండిపోదా ఈ క్షణం
ఓ గుండె లోతుల్లో కోలాహలం
ఓ నువ్వు నాలో సగం నేను నీలో సగం
తెచ్చి కలిపేసుకుందాం ఇలా
బాగుందే భలే గుందే
ఇదేం సంతో తెలియనంత
తమాషాగుందే బాగుందే
కన్ను కన్నూ కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం
ఇప్పుడయ్యాం కదా ఒక్కరం
ఓ ఏమో ఏమైందో
అమాంతం ఏమైపోయిందో
ప్రపంచం మనతో ఉండేదే
ఎలాగ మాయం అయ్యిందో
నిన్నూ నన్నూగా
ప్రపంచం అనుకోనుంటాది
మనల్నే చూస్తూ
తనకే దారి లేక వెళిపోయుంటుంది
కాలమంతేలే ఆగదే చోటా
కానీ మన జంట కౌగిట్లో
బంధీ లాగా ఉండిపోయిందే
భలేగుందే
కన్ను కన్నూ కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం
ఇప్పుడయ్యాం కదా ఒక్కరం
నువ్వే ముందుంటే
కనుల్లో మేఘం మెరిసిందే
అదేందో వెళ్లొస్తానంటే
నిజంగా గుండే తడిసిందే
నువ్వే ఉండగా తేలిగ్గా మనసే ఉంటాది
మరేమో దూరంగుంటే
మోయలేని భారంగుంటుంది
దీని పేరే ఏమిటంటారో
ఏది ఏమైన ఈ హాయి
చాలా చాలా చాలా బాగుందే
భలేగుందే
కన్ను కన్నూ కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
కన్ను కన్నూ కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం
ఇప్పుడయ్యాం కదా ఒక్కరం
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon