చిత్రం : ఉంగరాల రాంబాబు (2017)
సంగీతం : జిబ్రాన్
సాహిత్యం : రెహ్మాన్
గానం : రేవంత్, చిన్మయి
నువ్వే నా అదృష్టం
నువ్వే నా తీయని కష్టం
ఐపోవా నా సొంతం
నువ్వే నా ఊపిరిగీతం
నువ్వే నా పగలురేయి
నువ్వేలే నా దునియా
నువ్వే నా దిగులు హాయి
అంటుందీ గుండెలయా
ముహుర్తమే ముంచుకు
వచ్చేసిందే ముడిపడిపోగా
నువ్వే నా అదృష్టం
నువ్వే నా తీయని కష్టం
ఐపోవా నా సొంతం
నువ్వే నా ఊపిరిగీతం
తొలిసారి నిన్నే చూస్తూనే మనసిచ్చాలే
నీదారిలోనే పువ్వుల్నే పరిచేశానే
కనుసైగతోనే ప్రాణాన్నే గెలిచేశావే
నను లాగుతూనే దూరాన్నే తరిమేశావే
కాలమే భారమైందిలా
సాయమే నిన్ను కోరిందిలా
ఆశకే రెక్కలొచ్చాయిలా
ఆగనంటోంది లోలోపలా
ఎగిసే శ్వాసే తెలిపే నిన్నేచేరాలీవేళా
కాలం కలిసొచ్చిందె కలలే నడిచొచ్చేనీలా
నువ్వే నా అదృష్టం
నువ్వే నా తీయని కష్టం
ఐపోవా నా సొంతం
నువ్వే నా ఊపిరిగీతం
నువ్వే నా పగలురేయి
నువ్వేలే నా దునియా
నువ్వే నా దిగులు హాయి
అంటుందీ గుండెలయా
ముహుర్తమే ముంచుకు
వచ్చేసిందే ముడిపడిపోగా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon