చిత్రం : రాజా చెయ్యి వేస్తే (2016)
సంగీతం : సాయికార్తీక్
సాహిత్యం : డా.వెనిగళ్ళ రాంబాబు
గానం : శ్రీ చరణ్, సాయికార్తీక్
నీతోనే ఉంది ఈ ప్రపంచం
నీ తీరు నేడు మార్చుకొంచెం
అంతా నీ వారే ఇదంతా నీ ఊరే
చూడు భూగోళం చిన్ని పల్లెటూరే
ముళ్ళే పరిచుంటే నీ కళ్ళే తెరిచుంటే
వెళ్ళే నీ దారికూడ పూలదారే
కష్టాలైనా నష్టాలైనా ఇష్టం అనుకో ఇకనుంచైనా
కన్నీరు కళ్ళను కడిగే పన్నీరన్నా
చచ్చే వరుకు నీవనుకుంది
సాధించే అవకాశం ఉంది
ఆ ధైర్యం నీగుండెల్లో ఉండాలన్నా..
నీతోనే ఉంది ఈ ప్రపంచం
నీ తీరు నేడు మార్చుకొంచెం
నీనోరుమంచిదైతే ప్రతి ఊరు మంచిదేలే
నీ చూపే గునపం ఐతే ప్రతి బీడూ పంటచేలే
నీ కుంటే ఓర్పు నేర్పు ఇక ఉంటుందన్నా మార్పు
మరి ఉదయిస్తేనే తూర్పు ఇది కాలం చెప్పే తీర్పు
ఉరుములు వద్దనుకుంటే వానచినుకేలేదయ్యో
దుక్కి దున్నొద్దంటే మొక్క పైకి రాదయ్యో
తీపి రోజూ తింటే నాలుకంతా చేదయ్యో
ఒత్తిడికూడా వరమనుకుంటే
పుత్తడికాదా జీవితమంతా
హృదయం లేని మాటలకన్నా
మాటల్లేని హృదయం మిన్నా
హృదయం లేని మాటలకన్నా
మాటల్లేని హృదయం మిన్నా
ఎదురీది ఏటిని దాటెయ్ ఎవరేమన్నా
నీతోనే ఉంది ఈ ప్రపంచం
నీ తీరు నేడు మార్చు కొంచెం
పోరుతప్పదంటే నువ్వు నీరుగారిపోకు
ఇక ఏరుదాటమంటే నువ్వు ధీరుడల్లే దూకు
సొమ్మొకటేనా గొప్ప తీసెయ్ తాళం కప్పా
పైసానీతో రాదు నీ పాపం పుణ్యం తప్పా
నిన్నా మొన్నా ఏమైనా నేటినుండే జీవించు
చావునె నువ్ చంపేస్తూ జీవితాన్నే ప్రేమించు
కన్నవాళ్ళ కళ్ళల్లో కలువపూలే పూయించు
జీవితశిల్పం చెక్కేదెవరూ
బాధలనే ఉలిదెబ్బలు నేస్తం
కొన్నాళ్ళయినా కొన్నేళ్ళయినా
గుండెల్లో సెగ రగిలించాలి
కొన్నాళ్ళయినా కొన్నేళ్ళయినా
గుండెల్లో సెగ రగిలించాలి
ముందుండి నీవే శంఖం మోగించాలి
నీలోనే ఉంది చూడు స్వర్గం
నీ మనసే దాని రాజ మార్గం
ఓ సారి భగవద్గీత సుమతీశతకం
చదవాలోయ్ చిన్నా...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon