చిత్రం : శంకర్ దాదా జిందాబాద్ (2007)
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : దేవీశ్రీ ప్రసాద్, సాగర్
వందేమాతరం గాంధీ ఓంకారం
వందేమాతరం గాంధీ ఓంకారం
ఓ బాపు నువ్వే రావాలి
నీ సాయం మళ్ళీ కావాలి
వందేమాతరం గాంధీ ఓంకారం
జరిగే దుర్మార్గం ఆపాలి
నువ్వే ఓ మార్గం చూపాలి
వందేమాతరం గాంధీ ఓంకారం
కళ్ళజోడుతో చేతికర్రతో
కదిలే ఓ సత్యాగ్రహం..
కదిలే ఓ సత్యాగ్రహం
వెండికొండలా శిరసు పండినా
యువకుల మించిన సాహసం..
యువకుల మించిన సాహసం
బక్కపలచనీ బాపు గుండెలో
ఆ సేతు హిమాచలం
ద్రుక్కు నరాల్లో ఉప్పొంగే
స్వాతంత్ర్య రక్త గంగాజలం
సత్య మార్గమున మడమ తిప్పని
స్వరాజ్య దీక్షా మానసం
అతడంటే గడగడ వణికింది
ఆంగ్లేయుల సింహాసనం
వందేమాతరం గాంధీ ఓంకారం
వందేమాతరం గాంధీ ఓంకారం
చాకూ పిస్టలు కొడవలి గొడ్డలి
ఎందుకు హింసా సాయుధం..
ఎందుకు హింసా సాయుధం
ఆవేశం కోపం ద్వేషం కాదు
చిరునవ్వే మన ఆయుధం..
చిరునవ్వే మన ఆయుధం
సాటి మనిషిపై ప్రేమేగా
మన మాతృభూమికి గౌరవం
మానవతే మనకెన్నడు చెరగని
అందమైన గాంధీయిజం
వందేమాతరం గాంధీ ఓంకారం
వందేమాతరం గాంధీ ఓంకారం
భయం చెందని నెత్తురు చిందని
గాంధి మహోద్యమ జ్వాలలు
గాలి తరంగాలై వీచినవి
దేశంలో నలుమూలలు
వందేమాతరం గాంధీ ఓంకారం
వందేమాతరం గాంధీ ఓంకారం
వందేమాతరం గాంధీ ఓంకారం
వందేమాతరం గాంధీ ఓంకారం
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon