చిత్రం : ఇందిర (1996)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
రచన : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర
తొలి తొలి బిడియాలా పువ్వా త్వరపడి పరుగేలా
తొలి తొలి బిడియాలా పువ్వా త్వరపడి పరుగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై
పరవాశాన పసి పరువానా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై
పరవాశాన పసి పరువానా
తొలి తొలి బిడియాలా పువ్వా త్వరపడి పరుగేలా
చిన్నదాని వయసే చెంత చేర పిలిచే
తాకితే తడబడుతూ జారేందుకా
నిలవని అలలా నిలువున అల్లితే
మృదువైన పూల ప్రాయం ఝల్లుమనదా
ఆశల తీరాన మోజులు తీర్చెయ్ నా
హద్దు మరి తెంచేస్తే యవ్వనం ఆగేనా
తొలి తొలి బిడియానా పువ్వే సొగసుగ నలిగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై
నరముల వీణ మీటే తరుణమిదే
తొలి తొలి బిడియానా పువ్వే సొగసుగ నలిగేలా
మధువులు కురిసే.. పెదవుల కొరకే
ఇరవై వసంతాలు వేచి ఉన్నా
మదిలోని అమృతం పంచడానికేగా
పదహారు వసంతాలు దాచుకున్నా
ఇకపైన మన జంట కలనైన విడరాదే
మరీ కొంటె కల వెంట కన్నె ఎద తేల రాదే
తొలి తొలి బిడియానా పువ్వే సొగసుగ నలిగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై
పరవాశాన పసి పరువానా
తొలి తొలి బిడియాలా పువ్వా త్వరపడి పరుగేలా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon