ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో పాట లిరిక్స్ | గులాబి (1996)

 చిత్రం: గులాబి (1996)

సంగీతం: శశి ప్రీతం

సాహిత్యం : సిరివెన్నెల

గానం : సునీత


ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో

అనుకుంటూ వుంటాను ప్రతి నిమిషము నేను

నా గుండె ఏనాడొ చేయి జారి పోయింది

నీ నీడగా మారి నా వైపు రానంది

దూరాన వుంటునే ఏం మాయ చేసావొ 

ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో

అనుకుంటూ వుంటాను ప్రతి నిమిషము నేను

 

 నడి రేయిలో నీవు నిదరైన రానీవు

గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము

పగలైన కాసేపు పని చేసుకోనీవూ

నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము


ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది

నువు కాక వేరేమీ కనిపించనంటోంది 

ఈ ఇంద్ర జాలాన్ని నీవేన చేసింది

 

నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది

నీ మాట వింటూనే ఏం తోచనీకుంది

నీ మీద ఆశేదొ నను నిలువనీకుంది

మతి పొయి నేనుంటె నువు.. నవ్వుకుంటావు 


ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో

అనుకుంటూ వుంటాను ప్రతి నిమిషము నేను

ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో

అనుకుంటూ ఊహూ..హూ..హూహూ..


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)