చిత్రం : అంకురం (1993)
సంగీతం : హంసలేఖ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర
ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..
మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి
వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..
కదలరు ఎవ్వరు వేకువ వచ్చినా
అనుకొని కోడి కూత నిదరపోదుగా
జగతికి మేలుకొల్పు మానుకోదుగా
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే
మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే
వాన ధార రాదుగా నేల దారికి
ప్రాణమంటు లేదుగా బ్రతకటానికి
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..
చెదరకపోదుగా చిక్కని చీకటి
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి
దానికి లెక్క లేదు కాళరాతిరి
పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతిని
రెప్ప వెనక ఆపనీ కంటి నీటిని
సాగలేక ఆగితే దారి తరుగునా
జాలి చూపి తీరమే దరికి చేరునా
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..
యుగములు సాగినా నింగిని తాకక
ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా
ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా
ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే
అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా
నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon