మానసవీణ మౌనస్వరాన పాట లిరిక్స్ | హృదయాంజలి (1993)

 చిత్రం : హృదయాంజలి (1993)

సంగీతం : రెహ్మాన్

సాహిత్యం : సిరివెన్నెల

గానం : చిత్ర

మానసవీణ మౌనస్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం

మానసవీణ మౌనస్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం

పచ్చదనాల పానుపుపైన అమ్మైనేలా జోకొడుతుంటే

పచ్చదనాల పానుపుపైన అమ్మైనలా జోకొడుతుంటే

మానసవీణ మౌనస్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం

పున్నమినదిలో విహరించాలి పువ్వుల ఒళ్ళో పులకించాలి

పావురమల్లే పైకెగరాలి తొలకరి జల్లై దిగిరావాలి

తారల పొదరింట రాతిరిమజిలి వేకువ వెనువెంట నేలకు తరలి

కొత్త స్వేచ్చకందించాలి నా హృదయాంజలి

మానసవీణ మౌనస్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం

వాగుల నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే

నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎప్పుడు నా సొంతం

వాగుల నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే

నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎప్పుడు నా సొంతం

ఊహకు నీవే ఊపిరిపోసి చూపవే దారి ఓ చిరుగాలి

కలలకు సైతం సంకేలవేసి కలిమి ఎడారి దాటించాలి

తుంటరి తూనీగనై తిరగాలి దోసెడు ఊసులు తీసుకువెళ్ళి

పేద గరికపూలకు ఇస్తా నా హృదయాంజలి

మానసవీణ మౌన స్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం

మానసవీణ మౌన స్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం

పచ్చదనాల పానుపుపైన అమ్మైనేల జోకొడుతుంటే

పచ్చదనాల పానుపుపైన అమ్మైనేల జోకొడుతుంటే

మానసవీణ మౌన స్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం

వాగులా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే

నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడు నా సొంతం

వాగులా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే

నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడు నా సొంతం

వాగులా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే

నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడు నా సొంతం

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ హ హ ఆ ఆ హ ఆ ఆ

Share This :

Related Post

sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)