ఆనతి నీయరా పాట లిరిక్స్ | స్వాతికిరణం (1992)

 చిత్రం : స్వాతికిరణం (1992)

సంగీతం : కె.వి. మహదేవన్

సాహిత్యం : సిరివెన్నెల

గానం : వాణీజయరాం


ఆ.... ఆ... ఆ.... ఆ.....


ఆనతి నీయరా.. హరా

సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా.. దొరా...

సన్నిధి చేరగా... ఆనతి నీయరా.. హరా

సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా దొరా...

సన్నిధి చేరగా.... ఆనతి నీయరా.... హరా...


నీ ఆన లేనిదే రచింపజాలునా

వేదాలవాణితో విరించి విశ్వనాటకం

నీ సైగ కానిదే జగాన సాగునా

ఆ యోగమాయతో మురారి దివ్యపాలనమ్


వసుమతిలో ప్రతి క్షణం.. పశుపతి నీ అధీనమై

వసుమతిలో ప్రతి క్షణం.. పశుపతి నీ అధీనమై

కదులునుగా సదా సదాశివ

ఆనతి నీయరా.. హరా


ని ని స ని ప నీ ప మ గ స గ... ఆనతి నీయరా!

అచలనాధ అర్చింతునురా... ఆనతినీయరా!


పమ పని పమ పని పమ పని గమ పని

సని సగ సని సగ సని సగ పని సగ

గమగసా నిపమ గమగస సగసని... ఆనతినీయరా!

జంగమ దేవర సేవలు గొనరా...

మంగళ దాయక దీవెనలిడరా!

సాష్ఠాంగముగ దండము సేతురా... ఆనతినీయరా!


సానిప గమపానిపమ

గమగ పాప పప

మపని పాప పప

గగమ గాస సస

నిసగ సాస సస

సగ గస గప పమ పస నిస

గసని సాగ సాగ

సని సాగ సాగ

సగ గాస సాస

సని సాగ గ

గసగ గా

పద గస గా స ని పమగమ గా...

ఆనతినీయరా!


శంకరా...  శంకించకురా!

వంక జాబిలిని జడను ముడుచుకొని...

విసపు నాగులను చంకనెత్తుకొని...

నిలకడనెరుగని గంగనేలి...

ఏ వంకలేని నా వంకనొక్క

కడగంటి చూపు పడనీయవేమి..

నీ కరుణిక సేవించుకొందురా!

ఆనతినీయరా...


పప పమప నినిపమగస గగ

పప పమప నినిపమగస గగ

గమపని గా మపనిస మా పనిసగ

నీ స పా ని మా ప గా మ సా గామ

పప పమప నినిపమగస గగ


గమపని గా

మపనిస మా

పనిసగ నీ స పా ని మా ప గా మ సా గా మ

పప పమప నినిపమగస గగా

గమపని గమపని స మపనిసగని

గమపని గమపని స మపనిసగని

స పని మ ప గ మ సా గా మ

పప పమప నినిపమగస గ గా

గామాపని గమాపాని స మపానీసగని

స పని మ ప గ మ సా గా మ

పప పమప నినిపమగస గ గా గా


గగ మమ పప నిగ.. తక తకిట తకధిమి

మమ పప నినిసమ.. తక తకిట తకధిమి

పపనినిసస గని.. తక తకిట తకధిమి

సపని మప గమ సగమ

పప పమప నినిపమగస గ గా


రక్షా...  ధర శిక్షా దీక్షా దక్ష!

విరూపాక్ష! నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక..

పరీక్ష సేయక.. రక్ష.. రక్ష.. యను ప్రార్ధన వినరా!

ఆనతినీయరా...  హరా!

సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా దొరా...

సన్నిధి చేరగా.... ఆనతి నీయరా.... హరా


Share This :



sentiment_satisfied Emoticon