రానేల వసంతాలే పాట లిరిక్స్ | డాన్స్ మాస్టర్ (1989)

 చిత్రం : డాన్స్ మాస్టర్ (1989)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : వేటూరి 

గానం : చిత్ర


రానేల వసంతాలే.. శ్రుతి కానేల సరాగాలే

నీవే నా జీవనరాగం.. స్వరాల బంధం

నీదే నా యవ్వన కావ్యం.. స్మరించే గీతం


రానేల వసంతాలే..

 


 

ఈ మౌన పంజరాన.. నే మూగనై

నీ వేణువూదగానే నీ రాగమై

ఎగిరే శోకమై విరిసే తోటనై

ఏ పాట పాడిన పది పూవులై

అవి నేల రాలిన చిరుతావినై

బదులైనలేని ఆశలారబోసి


రానేల వసంతాలే..

 

ఓ ప్రేమికా చెలియా.. ఒడి చేరవా

ఈ చెలిమినీ ఇపుడే దరిజేర్చవా

రగిలే తాపమే ఎదలో తీరగా

నీ చూపుతోనే చలి తీరగా

నీ స్పర్శతోనే మది పాడగా

ఎదమీటి పోయే ప్రేమగీతిలాగా


రానేల వసంతాలే.. శ్రుతి కానేల సరాగాలే

నీవే నా జీవనరాగం.. స్వరాల బంధం

నీదే నా యవ్వన కావ్యం.. స్మరించే గీతం


రానేల వసంతాలే.. శ్రుతి కానేల సరాగాలే

Share This :



sentiment_satisfied Emoticon