చిత్రం : భాగ్యలక్ష్మి (1984)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథన్
సాహిత్యం : దాసరి
గానం : సుశీల
కృష్ణశాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
కృష్ణశాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
పాలలా తేనెలా దేశభాషలందు లెస్సగా
పాలలా తేనెలా దేశభాషలందు లెస్సగా
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
కృష్ణశాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
కృష్ణదేవరాయల కీర్తి వెలుగు తెలుగు
తెలుగూ... ఆఆ.ఆఆఆఅ.ఆఆఅ...
కృష్ణదేవరాయల కీర్తి వెలుగు తెలుగు
కాకతీయ రాజుల పౌరుషాగ్ని తెలుగు
కాకతీయ రాజుల పౌరుషాగ్ని తెలుగు
కూచిపూడి నర్తన త్యాగరాజ కీర్తన
కూచిపూడి నర్తన త్యాగరాజ కీర్తన
అడుగడుగు అణువణువు
అచ్చతెలుగు జిలుగు తెలుగు
సంస్కృతికే ముందడుగు
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
కృష్ణశాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
పోతులూరి వీరబ్రహ్మ సూక్తులన్ని తెలుగు
పొట్టి శ్రీరాముల త్యాగనిరతి తెలుగు
పొట్టి శ్రీరాముల త్యాగనిరతి తెలుగు
కందుకూరి సంస్కారం చిలకమర్తి ప్రహసనం
కందుకూరి సంస్కారం చిలకమర్తి ప్రహసనం
నేటి తరం ముందు తరం అనుసరించు బాట తెలుగు
జాతికిదే బావుటా...
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
కృష్ణశాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
పాలలా తేనెలా దేశభాషలందు లెస్సగా
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
కృష్ణశాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
పాలలా తేనెలా దేశభాషలందు లెస్సగా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon