మనసు ఒక మందారం పాట లిరిక్స్ | ప్రేమ తరంగాలు (1980)

 చిత్రం : ప్రేమ తరంగాలు (1980)

సంగీతం : చక్రవర్తి

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ

గానం : బాలు


ఉ..హు..ఆ.. ఆ.. ఆ..

లా..లాలాలా..

మనసు ఒక మందారం

చెలిమి తన మకరందం

ఆ మధురిమకు పులకించే

బ్రతుకు ఒక మధుమాసం


మనసు ఒక మందారం

చెలిమి తన మకరందం


ఈ తోటలో..  ఏ తేటిదో

తొలిపాటగా వినిపించెను

ఎద కదిలించెను

ఆ పాటనే నీ కోసమే

నే పాడినా వినిపించునా నేస్తమా?

వికసింతువా వసంతమా?


మనసు ఒక మందారం

చెలిమి తన మకరందం

ఆ మధురిమకు పులకించే

బ్రతుకు ఒక మధుమాసం


ఈ చీకటి.. నా లోకము

నీ రాకతో మారాలిరా

కథ మారాలిరా

ఆ మార్పులో నా తూర్పువై

ఈ మాపు నే వెలిగింతువా నేస్తమా?

వికసింతువా వసంతమా?


మనసు ఒక మందారం

చెలిమి తన మకరందం

ఆ మధురిమకు పులకించే

బ్రతుకు ఒక మధుమాసం


ఆహా..హా.. ఆ.. ఆ.. ఉమ్మ్..ఉమ్మ్ 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)