చిత్రం : మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : దాశరథి
గానం : రామకృష్ణ, సుశీల
జాబిల్లి చూసేను నిన్నూ నన్నూ .. ఓయమ్మో
నాకెంత సిగ్గాయె బావా.. బావా.. నను వీడలేవా
పొదరిల్లు పిలిచేను నిన్నూ నన్నూ .. ఓయబ్బో
నీకింత సిగ్గేల బాలా.. రావా నను చేరరావా
ఆ .. ఆ..
ఆకాశమార్గాన అందాల మేఘాలు...
పెనవేసుకున్నాయి చూడూ
చిగురాకు సరదాలు.. చిరుగాలి సరసాలు..
గిలిగింతలాయేను నేడూ
అందచందాలతో .. ప్రేమ బంధాలతో ..
జీవితం హాయిగా సాగనీ ..ఈ..ఈ..
బాలా రావా... నను చేరరావా..
ఆ .. ఆ .. ఆ ..
ఆ కొమ్మపై ఉన్న అందాల చిలకలు..
అనురాగ గీతాలు పాడేనూ...
సిరిమల్లె ఒడిలోన చిన్నారి తుమ్మెద..
మైమరచి కలలందు కరిగేనూ...
ముద్దు మురిపాలతో .. భావరాగాలతో ..
యవ్వనం పువ్వులా నవ్వనీ..ఈ..ఈ..
బావా... బావా ..నను వీడలేవా...
ఆ .. ఆ ..
బంగారు చెక్కిళ్ళ పొంగారు పరువాలు..
కొనగోటి మీటులే కోరేనూ
నీ లేత అధరాలు ఎంతెంతొ మధురాలు ..
ఈ నాడు నా సొంతమాయేనూ
దేవి దీవించెను .. స్వామి వరమిచ్చెను ..
ఇద్దరం ఏకమౌదాములే ..ఏ..ఏ..
బాలా.. రావా ..నను చేరరావా
జాబిల్లి చూసేను నిన్నూ నన్నూ .. ఓయబ్బో..
నాకెంత సిగ్గాయె బావా.. బావా ..నను వీడలేవా
పొదరిల్లు పిలిచేను నిన్నూ నన్నూ .. ఓయమ్మో..
నీకింత సిగ్గేల బాలా.. రావా.. నను చేరరావా
ఆ..అహా...హ...
ఆ..ఆ...ఆ..ఆహా...
ఆ..అహ...హ..
ఆ...ఆ..ఆ..ఆ..అహా...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon