చిత్రం : పిడుగు రాముడు (1966)
సంగీతం : టి.వి. రాజు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల
మనసే వెన్నెలగా.. మారెను లోలోన
వీడిన హృదయాలే.. కూడెను ఈ వేళ
మనసే వెన్నెలగా.. మారెను లోలోన
వీడిన హృదయాలే.. కూడెను ఈ వేళ..ఆ..
మనసే వెన్నెలగా.. మారెను లోలోన
విరిసే ఊహలలో.. పరువము నీవేలే
విరిసే ఊహలలో.. పరువము నీవేలే
మదనుడి కన్నులలో.. మగసరి నీదేలే
మదనుడి కన్నులలో.. మగసరి నీదేలే
సైగలతో.. కవ్వించే.. జవ్వని నీవే..
మనసే వెన్నెలగా.. మారెను లోలోన
వీడిన హృదయాలే.. కూడెను ఈ వేళ..ఆ..
మనసే వెన్నెలగా.. మారెను లోలోన..
తలపుల పందిరిలో..ఓ.. కలలే కందామా
తలపుల పందిరిలో..ఓ.. కలలే కందామా
కరగని కౌగిలిలో.. కాపురముందామా
కరగని కౌగిలిలో.. కాపురముందామా
కనరాని.. తీరాలే.. కనుగొందామా..ఆ..
మనసే వెన్నెలగా.. మారెను లోలోన
వీడిన హృదయాలే.. కూడెను ఈ వేళ..ఆ..
మనసే వెన్నెలగా.. మారెను లోలోన..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon