చిత్రం : అనురాగం (1961)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : ఆత్రేయ
గానం : భానుమతి
ప్రేమా.. పిచ్చీ.. ఒకటే
నువ్వు నేను వేరే
ప్రేమా.. పిచ్చీ.. ఒకటే
నువ్వు నేను ప్చ్ వేరే
కధచెపుతాను ఊ కొడతావా
ఊ కొడతావా
జో కొడతాను బబ్బుంటావా
బబ్బో
కధచెపుతాను ఊ కొడతావా
జో కొడతాను బబ్బుంటావా
అది ఇది కాదని
అమ్మను కానని అల్లరి చేస్తావా
నన్నల్లరి చేస్తావ
ప్రేమా.. పిచ్చీ.. ఒకటే
నువ్వు నేను ప్చ్.. ఆఆ..
నిండు మనసనే వెండి గిన్నెలో
నెయ్యీ నెయ్యం కలిపాను
నిండు మనసనే వెండి గిన్నెలో
నెయ్యీ నెయ్యం కలిపాను
పసిడి గిన్నెలో పాలబువ్వలో
ఆశా పాశం నిలిపాను..
ఆఆఆ..ఆఆఆఅ....
ఆఆఆ..ఆఆఆఅ....
ప్రేమా.. పిచ్చీ.. ఒకటే
నువ్వు నేను వేరే..
తల్లి కాని ఈ తల్లి గుండెలో
ఎవరూ ఊగని ఊయలలో
అమ్మకాని ఈ అమ్మ గొంతులో
ఎవరికి పాడని పాటలలో
జో..జో..జో..
జో..జో..జో..
ప్రేమా.. పిచ్చీ.. ఒకటే
నువ్వు నేను ప్చ్.. ఆఆ..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon