పాలనవ్వుల లోనా పగడాల వెలుగులు.. పాట
చిత్రం : జోకర్
సాహిత్యం : వంశీ ?
సంగీతం : వంశీ
గానం : బాలు, బేబీ షామిలీ
హహహ హహ హహహహహహ
పాలనవ్వుల లోనా పగడాల వెలుగులు..
బాల పలుకులోనా పలకాలి చిలకలూ..
పైన పగటి వేషం ఒక వేడుకైనదీ..
లోన తెగని పాశం ఈ జోకరైనదీ..
అమ్మా అమ్మా పూల రెమ్మా రెమ్మా..
నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మా..
పాలనవ్వుల లోనా పగడాల వెలుగులు..
బాల పలుకులోనా పలకాలి చిలకలూ..
పైన పగటి వేషం ఒక వేడుకైనదీ..
లోన తెగని పాశం ఈ జోకరైనదీ..
అమ్మా అమ్మా పూల రెమ్మా రెమ్మా..
నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మా..
చిలిపి మాటలూ చిలికే పాట పేరడీ
చురుకు చేతిలో తిరిగే పేక గారడీ..
చిట్టిపాప బెట్టూ అది హాటు ట్రాజెడీ
రట్టు చేయి బెట్టూ ఇది స్వీటు కామెడీ..
గువ్వా నువ్వూ నేను నవ్వే నవ్వూలోన
పువ్వూ పువ్వూ వాన జల్లాయెనూ..
కయ్యాలు నేటికి కట్టాయెనూ..
చిన్నారి ఆటల పుట్టయెనూ..
పాలనవ్వుల లోనా పగడాల వెలుగులు..
బాల పలుకులోనా పలకాలి చిలకలూ..
పైన పగటి వేషం ఒక వేడుకైనదీ..
లోన తెగని పాశం ఈ జోకరైనదీ..
అమ్మా అమ్మా పూల రెమ్మా రెమ్మా..
నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మా..
అయ్యయ్యో హ..
ఫైటింగ్ చేసేస్కుంటున్నారేంటి
హమ్మా... హహహ
తగువు పాపతో చెలిమి చేసి జోకరూ..
బిగువు లాగితే పొంగీ పోయె హ్యూమరూ..
ఎత్తు వేసి వస్తే ఎదురైన నేస్తమా
చిత్తు చేసినావే ఎదలోని బంధమా..
చిన్నా చిన్నా లేత పొన్నా పొన్నా
ప్రేమ కన్నా మిన్నా లేదు లేదోయన్నా..
కుందేలు జాబిలి ఫ్రెండాయెనూ...
అందాల స్నేహము విందాయెను.
పాలనవ్వుల లోనా పగడాల వెలుగులు..
బాల పలుకులోనా పలకాలి చిలకలూ..
పైన పగటి వేషం ఒక వేడుకైనదీ..
లోన తెగని పాశం ఈ జోకరైనదీ..
అమ్మా అమ్మా పూల రెమ్మా రెమ్మా..
నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మా..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon