నీజతే నేననీ.. నాజతే నీవనీ.. పాట లిరిక్స్ | భామనే సత్యభామనే (1996)

చిత్రం : భామనే సత్యభామనే (1996)
సంగీతం : దేవ
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : బాలు, చిత్ర



నీజతే నేననీ.. నాజతే నీవనీ..
తీయనీ ప్రేమే తలుపే తీయనీ..
నీజతే నేననీ.. నాజతే నీవనీ..
తీయనీ ప్రేమే తలుపే తీయనీ..

నాలోని తాళం పాడింది నీకై ఆవేదనా స్వరం..
ఆలాపనాయే నాలోని ఆశే ఆ జ్ఞాపకం వరం
చెంత చేరరాక చింత తీరనీక 
జంటలేని చినుకా కంటి మంట వెనుక
దాగలేదు ప్రాణ బంధమే..

నీజతే నేననీ.. నాజతే నీవనీ..

గుండెల్లొ తాపం ఓ తేనె దాహం కోరింది నీ స్నేహం..
ఓ నాటి రాగం ఈ నాటి పాటే పాలించె నా ప్రాణం
జరిగినదంతా కల ఆయెనంటా
వలపును మనసే మరిచినదంట
జన్మ బంధం వీడిపోవునో..

నీజతే నేననీ.. నాజతే నీవనీ..
తీయనీ ప్రేమే తలుపే తీయనీ..
నీజతే నేననీ.. నాజతే నీవనీ..
తీయనీ ప్రేమే తలుపే తీయనీ..
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)