నల్లా నల్లని వాడు..నిన్నూ కవ్వించెనా లిరిక్స్ | నిరీక్షణ

చిత్రం : నిరీక్షణ
సంగీతం : ఇళయరాజ
సాహిత్యం : ఆత్రేయ
గానం : జానకి

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా

నల్లా నల్లని వాడు..నిన్నూ కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ

వెన్నంటి వెంటాడి వస్తాడే ముచ్చూ
కన్నట్టే గీటేసి పెడతాడె చిచ్చూ వెన్నంటి వెంటాడి వస్తాడే ముచ్చూ
కన్నట్టే గీటేసి పెడతాడె చిచ్చూ చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడే
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడే
దారివ్వకే చుట్టూ తారాడుతాడే

పిల్లా పోనివ్వనంటూ చల్లా తాగేస్తడే
అల్లారల్లరివాడు..అబ్బో ఏం పిల్లడే..

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
శిఖిపింఛమౌళన్న పేరున్నవాడే..
శృంగార రంగాన కడతేరినాడే
 శిఖిపింఛమౌళన్న పేరున్నవాడే..
శృంగార రంగాన కడతేరినాడే
రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడె
రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడె
ఈ రాధకీడైన జతగాడు వాడే

మురళీలోలుడు వాడే..ముద్దూ గోపాలుడే
వలపే దోచేసినాడే..చిలిపీ శ్రీకృష్ణుడూ..

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా

నల్లా నల్లని వాడు..నిన్నూ కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
Share This :

Related Post

sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)