మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా పాట
సాహిత్యం : ఉమామహేశ్వరరావు
సంగీతం : పవన్ కుమార్
గానం : నిత్యసంతోషిణి
మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరసులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే
మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా
తూరుపు వెలుగుల పడమటి జిలుగుల
పగడపు మెరుపులలో మనమే
సాగర తీరపు చల్లని గాలుల గానంలో మనమే
చంద్రుడైనా చిన్నబోయే, ఇంద్రధనుసున ఇద్దరమే
చీకటి నలుపున మనమే
చిగురాకుల ఎరుపున మనమే
అలలకు కదులుతు అలసట ఎరుగని
నడచిన నావలు మనమే
ఆశల ఉషస్సున ఆరని జ్యోతులమిద్దరమే!
ఆఅ... మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా
స్వఛ్చపు తొలకరి వెచ్చని జల్లుల
పచ్చని కాంతులలో మనమే..
గలగల పరుగుల సరిగమ పలుకుల సెలపాటల మనమే
నింగి నేల చిన్నబోయే రంగులన్నీ ఇద్దరమే
ముసిరిన మంచున మనమే
గతియించని అంచున మనమే
ద్వైతము ఎరగని చరితను చెరపని కమ్మని ప్రియకథ మనమే
ఊహల జగాలలో ఊపిరి ఊసులమిద్దరమే
మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరసులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే
మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon