కమనీయం కైలాసం సాంగ్ లిరిక్స్ దక్షయజ్ఞం (1962) తెలుగు సినిమా | Aarde Lyrics



Album : Dakshayagnam


Starring: S.V.R, Devika, N. T. Rama Rao
Music : Saluri Hanumantha Rao
Lyrics-Arudra 
Singers :P. Susheela
Producer: Kadaru Nagabhushanam
Director: Kadaru Nagabhushanam
Year: 1962


English Script Lyrics Clcik Here




కమనీయం కైలాసం సాంగ్ లిరిక్స్



కమనీయం కైలాసం
కాంతుని సన్నిధిని కలలు ఫలించి
కవితలు పాడెను సంతోషం
కమనీయం కైలాసం

తెమ్మెరలూదే పిల్లనగ్రోవి
తీయని తొలిరేయి తెలియని హాయి
తెమ్మెరలూదే పిల్లనగ్రోవి
తీయని తొలిరేయి తెలియని హాయి
తేనియ చిందేటి కెమ్మోవి తావి
తేనియ చిందేటి కెమ్మోవి తావి
తీర్చేనోయి తనివీ

కమనీయం కైలాసం

నీ ప్రేమ సుధలో నెలవంక చలువ
నిను చూసి వికసించె నా కంటి కలువ
నీ ప్రేమ సుధలో నెలవంక చలువ
నిను చూసి వికసించె నా కంటి కలువ
చేసెద చెలువార శృంగార సేవ
చేసెద చెలువార శృంగార సేవ
చేకొను పరమ శివా

కమనీయం కైలాసం
కాంతుని సన్నిధిని కలలు ఫలించి
కవితలు పాడెను సంతోషం
కమనీయం కైలాసం
Share This :



sentiment_satisfied Emoticon