తెల్లారింది లెగండో... కొక్కొరోక్కో... లిరిక్స్ | కళ్ళు (1988)

తెల్లారింది లెగండో... కొక్కొరోక్కో... పాట 

 

 చిత్రం : కళ్ళు (1988)

సంగీతం : SPB

సాహిత్యం : సిరివెన్నెల

గానం : సిరివెన్నెల


తెల్లారింది లెగండో... కొక్కొరోక్కో...


తెల్లారింది లెగండో కొక్కొరోక్కో

మంచాలింక దిగండో కొక్కొరోక్కో


తెల్లారింది లెగండో కొక్కొరోక్కో

మంచాలింక దిగండో కొక్కొరోక్కో


పాములాంటి చీకటి పడగ దించి పోయింది

భయం నేదు భయం నేదు నిదర ముసుగు తీయండి

చావు లాటి రాతిరి సూరు దాటి పోయింది

భయం నేదు భయం నేదు సాపలు ట్టేయండి

ముడుసు కున్న రెక్కలిరిసి పిట్ట సెట్టు ఇడిసింది

ముడుసు కున్న రెక్కలిరిసి పిట్ట సెట్టు ఇడిసింది

మూసుకున్న రెప్పలిరిసి సూపు లెగర నీయండి


తెల్లారింది లెగండో కొక్కొరోక్కో

మంచాలింక దిగండో కొక్కొరోక్కో


చురుకు తగ్గిపోయిందీ చందురుడి కంటికి

చులకనై పోయిందీ లోకం సీకటికి

కునుకు వచ్చి తూగింది సల్లబడ్డ దీపం

ఎనక రెచ్చి పోయిందీ అల్లుకున్న పాపం

మసక బారి పోయిందా సూసేకన్ను

ముసురు కోదా మైకం మన్నూ మిన్ను

కాలం కట్టిన గంతలు దీసి

కాంతుల ఎల్లువ గంతులు ఏసి


తెల్లారింది లెగండో కొక్కొరోక్కో

మంచాలింక దిగండో కొక్కొరోక్కో


ఎక్కిరించు రేయిని సూసి ఎర్రబడ్డ ఆకాశం

ఎక్కుబెట్టి యిసిరిందా సూరీడి సూపుల బాణం

కాలి బూడిదై పోదా కమ్ముకున్న నీడ

ఊపిరితొ నిలబడుతుందా సిక్కని పాపాల పీడ

చమట బొట్టు సమురుగా సూరీణ్ణి ఎలిగిద్దాం

ఎలుగు చెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం

ఏకువ శత్తుల కత్తులు దూసి

రేతిరి మత్తును ముక్కలు సేసి


తెల్లారింది లెగండో కొక్కొరోక్కో

మంచాలింక దిగండో కొక్కొరోక్కో

Share This :



sentiment_satisfied Emoticon