రోజ్ రోజాపువ్వా... సాంగ్ లిరిక్స్ అల్లరి ప్రియుడు (1993) తెలుగు సినిమా



Album Allari Priyudu


Starring:Rajasekhar, Ramya Krishna, Madhu Bala
Lyrics-Veturi
Singers : S.P. Balasubramaniam, Chitra
Producer:Konark Movie Creations
Director:K Raghavendra Rao
Year: 1993


English Script Lyrics Click Here




రోజ్ రోజాపువ్వా... సాంగ్ లిరిక్స్




రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా... రోజాపువ్వా... పువ్వాపువ్వా...
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్నా పువ్వేనువ్వా... నవ్వేనువ్వా...
రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వేనువ్వా...
ముద్దు పెట్టకుండ గళ్ళుమనా మువ్వే నువ్వా...
పడుచుదనపు అలపు పాటవు నువ్వా... వా వా
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా... రోజాపువ్వా... పువ్వాపువ్వా...
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా... నవ్వే నువ్వా...

గులాబి గు. గు గు... గులాబి గు. గు గు...
చక్కదనానికి చక్కిలిగింతవు నువ్వా నువ్వా... కందే పువ్వా... కన్నా పువ్వా...
వెన్నెలవాకిట ఎర్రగ పండిన దివ్వే నువ్వా చిందే రవ్వా పొద్దే నువ్వా
గుండెచాటు ప్రేమలెన్నొ పోటుమీద చాటుతున్న రోజాపువ్వా
అందమైన ఆడపిల్ల బుగ్గపండు గిల్లుతున్న సిగ్గే నువ్వా
చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వా ఆ.ఆ.

రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా... రోజాపువ్వా... పువ్వాపువ్వా...
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్నా పువ్వేనువ్వా... నవ్వేనువ్వా...

ప్రేమ సువాసన పెదవుల వంతెన వేసే నువ్వే పూసే పువ్వా బాసే నువ్వా
కౌగిలి చాటున కాముడు మీటిన వీణే నువ్వా జాణే నువ్వ జాజే నువ్వా
గుప్పుమన్న ఆశలెన్నో కొప్పులోన దాచుకున్న రోజాపువ్వా
సందెపొద్దు సంతకాల ప్రేమలేఖ పంపుకున్న గువ్వే నువ్వా
మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా

రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా... రోజాపువ్వా... పువ్వాపువ్వా...
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్నా పువ్వేనువ్వా... నవ్వేనువ్వా...
రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వేనువ్వా...
ముద్దు పెట్టకుండ గళ్ళుమనా మువ్వే నువ్వా...
పడుచుదనపు అలపు పాటవు నువ్వా... వా వా

రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా... రోజాపువ్వా... పువ్వాపువ్వా...
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా... నవ్వే నువ్వా...

Share This :



sentiment_satisfied Emoticon