శివానీ... భవానీ సాంగ్ లిరిక్స్ స్వాతికిరణం (1992) తెలుగు సినిమా | Aarde Lyrics

 


Album:Swati Kiranam


Starring:Mammootty, Radhika, Master Manjunath
Singers :S.P. Balu
Producer: V. Madhusudana Rao
Director:K. Viswanath
Year : 1992

English  Script Lyrics Click Hereశివానీ... భవానీ... శర్వాణీ...
గిరినందిని శివరంజని భవ భంజని జననీ
గిరినందిని శివరంజని భవ భంజని జననీ
శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని
నీ సుతుడనే శివానీ

శివానీ... భవానీ... శర్వాణీ...

శృంగారం తరంగించు సౌందర్య లహరివని... ఆ....
శృంగారం తరంగించు సౌందర్య లహరివనీ...
శాంతం మూర్తీభవించు శివానంద లహరివని... ఆ...
శాంతం మూర్తీభవించు శివానంద లహరివని...
కరుణ చిలుకు సిరినగవుల కనకధారవీవనీ
నీ దరహాసమే దాసుల దరిజేర్చే దారియనీ
శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని
నీ సుతుడనే శివానీ

శివానీ... భవానీ... శర్వాణీ... 
 
రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళివీవనీ
భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ
రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళివీవనీ
భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ
బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ
బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ...
భీషణాస్త్ర కేళివనీ...
అద్భుతమౌ అతులితమౌ లీల జూపినావనీ
 
గిరినందిని శివరంజని భవ భంజని జననీ
శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని
నీ సుతుడనే శివానీ
శివానీ... భవానీ... శర్వాణీ.
Share This :sentiment_satisfied Emoticon